Refrigerator blast: తమిళనాడులో మదురైలోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. పలువురికి గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఒక గదిలో ఎలక్ట్రానిక్ పరికరం పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మదురైలోని కాట్రపాళయంలో ఈ హాస్టల్ ఉంది, ఇక్కడ అనేక మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు.
Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్‌లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.