Char Dham Yatra 2025: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల ‘‘చార్ ధామ్’’ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్‌నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్‌కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్‌కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి.
సోషల్ మీడియా మోజులో పడి యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఇల్లు, బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ.. ఇష్టానురీతిగా పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించే విధంగా రీల్స్ చేస్తూ విసుగు పుట్టిస్తున్నారు.