ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది.
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
హౌతీ రెబెల్స్‌ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది.
కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సెంట్రల్ గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే.
Red Sea: ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకలతో పాటు, రెడ్ సీలో ఇతర దేశాలకు చెందిన నౌకలపై కూడా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు.
ఎర్ర సముద్రం రణరంగంగా మారుతోంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ సముద్రం గుండా వచ్చే వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు అమెరికా మిలిటరీ ఆ ప్రాంతంలో మోహరించింది. రెడ్ సీలో కంటైనర్ షిప్‌లపై దాడులు చేస్తున్న ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగబాటుదారులు నిర్వహిస్తున్న మూడు నౌకల్ని ముంచేసినట్లు యూఎస్ నేవీ తెలిపింది. యూఎస్ నేవీ హెలికాప్టర్లు వీటిపై దాడి చేసినట్లు ఆదివారం వెల్లడించింది.
Iran: ఇటీవల అరేబియా సముద్రంలో భారత్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్‌కి వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగింది. అయితే భారత్ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్ ఆరోపించిన తర్వాత టెహ్రాన్ నుంచి…
Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్‌కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత…