Israeli PM Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. అయితే, ఆయన పర్యటన వాయిదా పడిందంటూ ఇజ్రాయిల్ మీడియా కథనాలను వెల్లడించింది. ఢిల్లీ ఉగ్ర దాడి నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా నెతన్యాహూ పర్యటన వాయిదా పడినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
Delhi Car Blast: ఢిల్లీలో కార్ బాంబ్ ఘటన దేశాన్ని ఆందోళన పడేలా చేసింది. ఈ ‘‘వైట్ కాలర్’’ ఉగ్ర మాడ్యూల్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు బాంబు పేలుడుకు కారణమైన ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ, మిగతా తన ఉగ్రవాద అనుచరులకు పాలకుడిగా చెప్పుకునే వాడని, తనను తాను ‘‘ఎమిర్’’గా పిలుచుకునే వాడని తెలిసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ వాని 2016లో భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. బుర్హాన్ మృతికి…
Omar Abdullah: కొంత మంది చేసిన ఉగ్రవాద చర్యలు కాశ్మీర్ లోయలోని నివాసితులందర్ని కించపరుస్తున్నాయని, అందరూ అనుమానిస్తున్నారని, కాశ్మీర్ నుంచి బయటకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు చాలా మంది దూరంగా ఉంటున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ ‘‘వైట్ కాలర్’’ మాడ్యుల్‌తో సంబంధం ఉన్న మరో మహిళా వైద్యురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందాలు అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలోని ఒక హాస్టల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో హర్యానా రోహ్‌తక్‌కు
Delhi Car Blast: వారం క్రితం ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘‘వైట్ కాలర్’’ మాడ్యూల్‌గా పిలువబడుతున్న ఈ ఉగ్రదాది వెనకాల ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు సూత్రధారులుగా ఉన్నారు.
Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట్ కార్ బాంబు దాడి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ధౌజ్, నుహ్, దాని పరిసర ప్రాంతాలపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్, కేంద్ర సంస్థలు శుక్రవారం రాత్రి సమన్వయ దాడులు నిర్వహించాయి.
BJP vs Congress: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పేలుడు తర్వాత చిదంబరం మాట్లాడుతూ.. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.
Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు…
Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్‌మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు.…
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడుల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో దాడులు చేయాలని…