Israeli PM Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. అయితే, ఆయన పర్యటన వాయిదా పడిందంటూ ఇజ్రాయిల్ మీడియా కథనాలను వెల్లడించింది. ఢిల్లీ ఉగ్ర దాడి నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా నెతన్యాహూ పర్యటన వాయిదా పడినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ వాదనల్ని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. ఇవన్నీ ‘‘తప్పుదారి పట్టించే’’, ‘‘వాస్తవానికి తప్పు’’ అని తెలిపాయి. ఢిల్లీ పేలుడుతో నెతన్యాహూ పర్యటనను ముడిపెట్టే, తప్పుదారి పట్టించే కథనాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వ వర్గాలు కోరాయి.
Read Also: Pakistani Couple: భారత సరిహద్దు దాటిన పాకిస్తానీ ప్రేమ జంట..
నెతన్యాహూ వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కావాల్సి ఉంది. ఇది 7 ఏళ్ల తర్వాత నెతన్యాహూ చేయబోతున్న తొలి భారత పర్యటన. గాజా యుద్ధం తర్వాత తొలి పర్యటన. చివరిసారిగా 2018లో నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. గాజాలో యుద్ధనేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ తర్వాత, నెతన్యాహూ తన అంతర్జాతీయ ప్రయాణాలను పరిమితం చేసుకున్నారు.
ఇటీవల, ఢిల్లీలో ఉగ్రదాడి జరిగింది. దీంట్లో 15 మంది మరణించారు. ఈ దాడి నేపథ్యంలో నెతన్యాహూ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు ఇజ్రాయిల్ ఐన్యూస్ నివేదిక పేర్కొంది. భద్రతా కారణాల వల్ల వచ్చే ఏడాది నెతన్యాహూ భారత పర్యటన ఉంటుందని అక్కడి మీడియా నివేదించింది. ఆయన పర్యటన వాయిదా పడటం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. అంతకుముందు ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో ఆయన పర్యటనలు రద్దు అయ్యాయి. చివరిసారిగా 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌లో పర్యటించారు.