President Droupadi Murmu: భారీ వర్షం కురుస్తున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజున ఎర్రకోటలో జరిగిన దసరా వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనేది ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్కులో జరిగిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో రాష్ట్రపతి బాణం ఎక్కుపెట్టారు.
Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్..
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పండుగ ఎల్లప్పుడూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అహంకారంపై వినయం సాధించిన విజయాన్ని, అలాగే ద్వేషంపై ప్రేమ సాధించిన విజయాన్ని సూచిస్తుందని చెప్పారు. ధార్మిక రామ్‌లీలా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఉగ్రవాదం మానవత్వంపై దాడి చేసినప్పుడు, దానిని తిప్పికొట్టడం అవసరం. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన విజయానికి గుర్తు, ఇందుకోసం మన సైనికులకు వందనం’ అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనేది మే 7వ తేదీన పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ప్రారంభించిన ఒక సైనిక చర్య. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో సాయుధ ఉగ్రవాదులు పౌరులను, ముఖ్యంగా 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఘటనకు ఇది ప్రతిస్పందనగా ఉంది.
Taliban: భారతదేశ పర్యటనకు తాలిబాన్ విదేశాంగ మంత్రి..
భారీ వర్షం ఉన్నప్పటికీ.. రావణ దహనం చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎర్రకోట వద్ద గుమిగూడారని ఆమె పేర్కొన్నారు. రావణుడిపై శ్రీరాముడి విజయం నుంచి ఉద్భవించిన ఈ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ, రావణుడి బొమ్మను దహనం చేయడం అనేది ఒక లోతైన సందేశాన్ని కూడా ఇస్తుందని ముర్ము చెప్పారు. ఈ కార్యక్రమం బయట ఉన్న రావణుడిని నాశనం చేయడమే కాదు, మనలో ఉన్న రావణుడిని కూడా అంతం చేయడమే. అప్పుడే సమాజం శాంతి, సామరస్యంతో ముందుకు సాగగలదని ఆమె అన్నారు. అంతేకాకుండా అంతర్గత దుర్మార్గాలను అధిగమించాలని కోరారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.