Weather Alert: భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో నేడు ( సోమ), రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Red Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Mumbai rain: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది.
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్‌లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇ
TS Rains: ఉత్తర ఆంధ్రప్రదేశ్.. ఒరిస్సా.. ఛతీస్ ఘడ్ తీరాల్లో బలపడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఎనిమిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పలు రహదారులు జలమయమయ్యాయి.
రానున్న రెండు రోజులు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం అతి నుండి అత్యంత �