తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణవాఖ.. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందే రావడంతో ముంబైలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది… ఈ విషయాన్ని ఐఎండీ ముంబై…
ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనిస్తుండడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తౌక్టే తుఫాన్ తో కేరళ వణికిపోతుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళ ప్రభుత్వం. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాదు 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లుగా తెలిపింది.…