ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత నాలుగు రోజులుగా ముంబైను వరుణుడు వదిలిపెట్టడం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది.
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్‌గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గురువారం తెలంగాణలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. జూలై 21 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. రైల్వే స్టేషన్ల, ఎయిర్‌పోర్టుల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే రైళ్లు, 50 విమానాలు రద్దు చేశారు. అలాగే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా.. మరికొందరు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
Heavy rains in Kerala: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో గురువారం రోజు మొత్తం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.24 గంటల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షం కురిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.
Heatwave in Europe: యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యూకేలో భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు పలు దేశాల్లో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. తాజాగా శనివారం ఫ్రాన్స్, స్పెయిన్ అడవుల్లో మంటలు చెలరేగాయి. వేసవి కాలంలో పెరుగుతున్న హీట్ వేవ్ కారణంగానే కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. నైరుతి ఫ్రాన్స్,