IMD Alert: ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.. రెడ్ అలర్ట్ జారీ
- ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు
- రెడ్ అలర్ట్ జారీ చేసిన కేంద్ర వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: వేధింపులు భరించలేకపోతున్నా.. తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఏడుగురు ఆచూకీ గల్లంతైంది. ప్రమాద సమయంలో 29 మంది ఉండగా.. 20 మందిని అధికారులు రక్షించారు. ఇదిలా ఉంటే వరదలు కారణంగా చార్‌ధాయ్ యాత్రను 24 గంటల పాటు అధికారులు నిలిపివేశారు. రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారమందించారు. సోమవారం వాతావరణ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: RukminiVasanth : రెమ్యనరేషన్ విషయంలో తగ్గేదిలే.. అంటున్న కన్నడ భామ..
ఇక జార్ఖండ్‌లోని తూర్పు సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో అధికారులు రక్షించారు. ఇక పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
⛈️ Uttarakhand Cloudburst Triggers Chaos – Char Dham Yatra Halted, 9 Missing
📍Uttarkashi, India –
• Heavy rains and a cloudburst hit Uttarkashi, causing landslides and widespread disruption.
• Nine workers missing near a hotel site on the Yamunotri Highway, search ops… pic.twitter.com/ZkxDgS2l03— Snap Media (@SnapMediaLive) June 29, 2025
#WATCH | Kullu, Himachal Pradesh | IMD issues a yellow alert for Kullu as the state continues to receive heavy rainfall. pic.twitter.com/A71nfgEyML
— ANI (@ANI) June 30, 2025
🌧️ #Uttarakhand | Heavy rains caused Dhangarhi & Dhikuli canals to overflow, disrupting traffic on NH-309 between Ramnagar & Kumaon-Garhwal
Vehicle movement halted, police managing traffic. Administration on alert; public advised to avoid unnecessary travel
🛣️ #UttarakhandRains pic.twitter.com/NniieWLzYP
— The Bharat Current (@thbharatcurrent) June 29, 2025
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!