Recruitment: ఆ దేశంలో భారీగా కార్మికుల కొరత? రూ.1.32 లక్షల జీతం.. భారతీయులకే ప్రాధాన్యత
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
- ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత
- భారత్ నుంచి భారీగా రిక్రూట్ మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి, ఇజ్రాయెల్ భారతదేశాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం వేలాది మంది కార్మికులు ఇజ్రాయెల్ లో పనిచేసేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మరోసారి భారత్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను రిక్రూట్ చేసుకుంటోంది. ఇజ్రాయెల్‌కు భారతదేశం నుంచి 10,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. దీని కోసం దాని కొనసాగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రచారం సెప్టెంబర్ 25 బుధవారం వరకు కొనసాగుతుంది.
READ MORE: Labanon: లైవ్‌లో ఉండగా జర్నలిస్టుపై పడ్డ ఇజ్రాయెల్ క్షిపణి.. వీడియో వైరల్
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
పూణేలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఇజ్రాయెల్‌లో పనిచేసేందుకు హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్మికులను రిక్రూట్‌మెంట్ చేసిన విధంగానే ఈ ఏడాది కూడా ఈ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు, సుమారు 4,800 మంది భారతీయ కార్మికులు ఇజ్రాయెల్‌లో మోహరించారు. ప్రతి నెలా దాదాపు రూ.1.32 లక్షల జీతం, రూ.16,000 నెలవారీ బోనస్‌గా పొందుతారు. ఇజ్రాయెల్‌లో పని చేయడానికి రిక్రూట్ చేయబడిన మొదటి బ్యాచ్ కార్మికులతో పాటు, 1,500 మంది కార్మికులు సెప్టెంబర్ 18న భారతదేశం నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరారు.” అని పేర్కొన్నారు.
READ MORE:Harsha Sai: హర్ష సాయి ఆడియో లీక్.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?
ఇజ్రాయెల్ రిక్రూటర్లు తమ రిక్రూటింగ్ లక్ష్యాన్ని విస్తరించారని, ఈ రౌండ్‌లో అదనంగా 10,000 మంది అభ్యర్థులను కోరినట్లు అధికారులు తెలిపారు. ఫ్రేమ్‌వర్క్, ఐరన్ బెండింగ్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైలింగ్ బిగించడంలో నైపుణ్యం ఉన్న కార్మికులను ఈసారి నియమిస్తున్నట్లు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 12 మంది ఇజ్రాయెల్ అధికారుల ప్రతినిధి బృందం సెప్టెంబర్ 16న భారత్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా.. యుద్ధం మధ్య, అనేక కార్మిక సంఘాలు కూడా భారతీయ కార్మికులు ఇజ్రాయెల్‌కు వెళ్లడాన్ని వ్యతిరేకించాయి. యుద్ధం నేపథ్యంలో భారతీయులు ఇజ్రాయెల్ వెళ్లడం అత్యంత ప్రమాదకరమని విమర్శకులు అంటున్నారు. కార్మికుల సంక్షేమం, వారి భద్రతపై ప్రభుత్వం ఆలోచించాలని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, చాలా మంది భారతీయ కార్మికులు అధిక జీతాల కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ఎంచుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!