గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. విచారణ తప్పదని హెచ్చరిస్తోన్న విషయం విదితమే.. అయితే, వైసీపీ హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.