సృష్టిలో తల్లి జన్మనిస్తుంది. కానీ అవయవదానం చేసేవారు పునర్జన్మను ఇచ్చినట్టే. ఈమధ్యకాలంలో అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకోవాలన్నారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…