సంగారెడ్డి జిల్లా వెలిమెలకు చెందిన రియల్టర్ హత్య కేసుని చేధించారు పోలీసులు. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపింది. కనిపించకుండా పోయిన రియల్టర్ కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. హత్యకేసులో మృతుని సోదరుడు రాంసింగ్ నాయక్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి.. వెలిమెల కడవత్ రాజు నాయక్ ను హత్య చేసి ఒక చోట తల, మరో చోట మొండెంను పడేశారు హంతకులు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగింది. 10లక్షల సుఫారీ ఇచ్చాడు రాంసింగ్, రాజునాయక్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు ముఠా సభ్యులు.
భూ విక్రయాల లావాదేవీల కారణంగానే హత్య జరిగింది. సొంత పెద్దనాన్న కొడుకు రాం సింగ్ ఈ హత్యలో ముఖ్య కారకుడు అని పోలీసులు తెలిపారు. కవలం పేట కు చెందిన విష్ణు, రమేష్, మాధవ్ అనే కిరాయి హంతకులతో కలిసి గొడ్డలి, కత్తులతో హత్యకు పాల్పడ్డారు. హత్యకు పాల్పడిన రాంసింగ్, విష్ణు,రమేష్,బాలు, వెంకటేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి.