కరోనా మహమ్మారి తర్వాత వివిధ రంగాలు క్రమంగా పుంజుకుంటున్నాయి.. కోవిడ్ అన్ని రంగాలపై ప్రభావం చూపించి.. ఆర్థికంగా దెబ్బ కొట్టగా.. మళ్లీ విభాగాల్లో ఆదాయం పెరుగుతోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది.. 2021వ సంవత్సరం ఊహించని మార్పులు రాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆస్తి కొనుగోళ్లలో పెరుగుదలను చూసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ. 7327 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఆదాయం వచ్చింది.. 2021-22…
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 13 సంవత్సరాల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నారు. రాజకీయాలనుంచి తప్పుకుని ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు అనూహ్యవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది.…
మార్కెట్ చూపిన బలమైన వృద్ధి ఔట్‌లుక్‌ను దృష్టిలో ఉంచుకుని, జాతీయ, నగర ఆధారిత కంపెనీలకు చెందిన అనేక రెసిడెన్షియల్ డెవలపర్‌లకు హైదరాబాద్ విస్తరణ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ జోరు 2022 మరియు అంతకు మించి కొనసాగుతుందని భావిస్తున్నారు.ప్రెస్టీజ్ గ్రూప్ ఇటీవల హైదరాబాద్‌లో ఒక ప్రధాన నివాస అభివృద్ధిని ప్రారంభించింది. ఇది కోకాపేట్‌లోని అభివృద్ధి చెందుతున్న వాణిజ్య, నివాస కేంద్రంగా ఉంది. ఇది మూడు ఎత్తైన టవర్‌లతో (మూడు మరియు నాలుగు…
మహా నగరం హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది… ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ స్థాయిలో కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి.. ప్లాట్లు, ఇళ్లు ఇలా రెగ్యులర్‌గా క్రయ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. ప్రతిష్టాత్మక సంస్థలు రంగంలోకి దిగి విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు.. ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నాయి.. కొన్ని చోట్ల ఇప్పటికే ఓఆర్ఆర్‌ను దాటేసి రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది… రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా బిజినెస్…
ఇండియన్ బిజినెస్ మెన్ ఆదానీకి అనేక రకాల వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అదానీ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఆదానీ రియల్ గ్రూప్ బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఓజోన్ రియల్ ఎస్టేట్ ను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అదానీ గ్రూప్ ఓజోన్ గ్రూప్ తో చర్చలు జరుపుతున్నది. ఈ డీల్ విలువ బిలియన్ డాలర్లు ఉండే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఓజోన్ గ్రూప్‌పై దాదాపు…
నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎవర్‌గ్రాండ్. చైనాలో వేలాది ఇళ్లను నిర్మించింది. వేగంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు, అంతే వేగంగా నిర్మాణాలను పూర్తిచేయడంలోనూ ఎవర్‌గ్రాండ్ సంస్థ ముందు వరసలో ఉంటుంది. అలాంటి ఎవర్‌గ్రాండ్ సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎవర్ గ్రాండ్ 300 బిలియన్ డాలర్లమేర అప్పులు చెల్లించాల్సి ఉన్నది. ఈ అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మేందుకు ఎవర్‌గ్రాండ్ సిద్దమైనప్పటికీ కుదరలేదు. Read: మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి…
జీవితంలో సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడే త్వరపడండి. లేకపోతే మీరు ఇల్లు కొనుగోలు చేయడం కష్టతరం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనా పరిణామాల వల్ల గత రెండేళ్లుగా నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. వచ్చే ఏడాది మాత్రం 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు 2022 అవుట్ లుక్…
శిల్పా చౌదరిని రెండవ రోజు విచారిస్తున్నారు పోలీసులు. శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు ముందు నోరు విప్పిన శిల్పా రాధికా రెడ్డి అనే రియల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతోంది రాధికా రెడ్డి. దీంతో రాధికా రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. రాధికా రెడ్డి కి ఆరు కోట్లు ఇచ్చింది శిల్పా చౌదరి. ఆరు శాతం వడ్డీకి శిల్పా దగ్గర…