ఇండియన్ బిజినెస్ మెన్ ఆదానీకి అనేక రకాల వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అదానీ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఆదానీ రియల్ గ్రూప్ బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఓజోన్ రియల్ ఎస్టేట్ ను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అదానీ గ్రూప్ ఓజోన్ గ్రూప్ తో చర్చలు జరుపుతున్నది. ఈ డీల్ విలువ బిలియన్ డాలర్లు ఉండే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఓజోన్ గ్రూప్‌పై దాదాపు 6 వేల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి.
Read: ఉస్మానియాలో తొలి హోమోగ్రాఫ్ట్ సర్జరీ…
ఈ సంస్థ ముంబాయి, బెంగళూరు, చెన్నైలలో బారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఈ ఓజోన్ సంస్థ ఇప్పటి వరకు సుమారు 13.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తిచేసింది. దీనితో పాటుగా మరో 40 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను చేపడుతున్నది. భారీ నిర్మాణాలను చేపడుతున్న ఆ సంస్థకు అప్పులు కూడా పెరిగిపోతుండటంతో ఈ డీల్‌ను తెరమీదకు తీసుకొచ్చింది అదానీ గ్రూప్. ఓజోన్ గ్రూప్ అప్పులు తీర్చేందుకు అదానీ రియల్ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడంతో త్వరలోనే ఓజోన్ రియల్ గ్రూప్ అదానీ చేతికి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.