కరోనా మహమ్మారి తర్వాత వివిధ రంగాలు క్రమంగా పుంజుకుంటున్నాయి.. కోవిడ్ అన్ని రంగాలపై ప్రభావం చూపించి.. ఆర్థికంగా దెబ్బ కొట్టగా.. మళ్లీ విభాగాల్లో ఆదాయం పెరుగుతోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది.. 2021వ సంవత్సరం ఊహించని మార్పులు రాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆస్తి కొనుగోళ్లలో పెరుగుదలను చూసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ. 7327 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఆదాయం వచ్చింది.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 20.76 లక్షల రిజిస్ట్రేషన్లు అయినట్టు గణాంకాలు చెబతున్నాయి.. దీంతో గతేడాది కంటే సుమారు రూ. 2 వేల కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది.
Read Also: Ukraine Russia War: రివర్స్ ఎటాక్.. రష్యా భూభాగంలో బాంబుల మోత..