రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనిలో ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటా హుటిన బాలుడ్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Police Station: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఓ దొంగ అనుమానాస్పద మృతి కేసు పోలీసులపై వేటు పడేలా చేసింది.. ఈ ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం తమకు అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్‌కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు…
నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల ఎగిసిపడుతుండటంతో.. బిల్డింగ్ అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 14 మంది చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు క్రైన్ సహాయంతో వారిని సురక్షితంగా రక్షించారు. ఎన్టీవీ తో పైర్ ఆఫీసర్, మాదాపూర్ ఏసీపీ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఫోన్ కాల్…
మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ…
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పై కేసుల ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ రావుపై పలు పోలీస్ స్టేషన్ లో చీటింగ్, ల్యాండ్ కబ్జాలు, ఫోర్జరీ, బెదిరింపులు మోసాలు పాల్పడ్డ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కమిషనరేట్ లో 16 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 2012లో బంజారాహిల్స్ లో సంధ్య శ్రీధర్ రావు పై కేసు వుంది. 2016లో శ్రీధర్ రావు పై సీసీఎస్ లో కేసు నమోదయింది. 2017 లో సీసీఎస్‌లో ల్యాండ్ గ్రాబింగ్…
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావుపై ఉచ్చుబిగుస్తోందా? ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు సంధ్య శ్రీధరరావు బాధితులు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లో 16 పైగా కేసు నమోదయ్యాయి.నార్సింగి,రాయదుర్గం, గచ్చిబౌలి ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ,మియాపూర్ లో శ్రీధరరావు పై కేసులు నమోదయ్యాయి. తాజాగా రాయదుర్గం భవన వ్యవహారం సంబంధించి చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో చైతన్య రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చైతన్య. రాయదుర్గం ఏరియా లో…
గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలుకు చేరింది. దీంతో సామాన్యులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ఆలొచిస్తున్నారు. పెట్రోల్ ధరలకు భయపడి బయటకు రావడమే మానేశారు. పెట్రోల్ ధరలకు భయపడిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి 10 వేల రూపాయలు ఖర్చుచేసి జట్కాబండిని తయారు చేసుకున్నాడు. స్వతహాగా అతను రజకుడు కావడంతో నిత్యం దుస్తులను సేకరించేందుకు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో రజకుడు…