Co Living Hostels: భాగ్యనగరంలోని ఐటీ హబ్‌గా పేరుగాంచిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసరాల్లోని కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం అంజయ్యనగర్‌లోని ‘కో-లివ్ గార్నెట్ పీజీ హాస్టల్’ వేదికగా జరుగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ (SOT) పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో కో-లివింగ్ హాస్టళ్ల ముసుగులో సాగుతున్న చీకటి వ్యాపారం బయటపడింది. హాస్టల్‌పై ఆకస్మిక దాడి చేసిన పోలీసు…
హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని భూమికి ఆల్ టైమ్ రికార్డు ధర దక్కింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ, జేఎల్ఎల్ ఇండియా అండ్ ఎంఎస్టీసీ భాగస్వామిగా వేలం నిర్వహించారు. రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. మొత్తం రూ.1357.59 కోట్లు ప్రభుత్వంకు దక్కింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. వేలంలో ఇది…
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గుట్టల వేణుగోపాల్ (26)గా గుర్తించారు. వేణుగోపాల్ తన అన్న, వదినతో కలిసి మణికొండలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం, తాను నివసిస్తున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీ లీడర్స్, కేడర్‌కు గడ్డు కాలం నడుస్తోంది. కొన్ని చోట్ల కేడర్‌కు అండగా ఉండాల్సిన లీడర్స్ సేఫ్ జోన్స్ చూసుకుంటుంటే... గతంలో వాళ్ళనే నమ్ముకుని చెలరేగిపోయిన వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారట. డైరెక్ట్‌గా అలాంటిది కాకున్నా... దాదాపుగా అదే తరహాలో, ఇంకా చెప్పుకోవాలంటే ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారట ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ కార్యకర్తలు. రాయదుర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్, టిడిపి సమఉజ్జీలుగా ఉండేవి.
పిలిచి పిల్లనిస్తామంటే పెళ్ళి కూతురు గురించి తేడాగా మాట్లాడినట్టు ఉందట అక్కడి వ్యవహారం. వైసీపీ అధిష్టానం ఏరికోరి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే.... తీరా ఓడిపోయాక ఉన్నారో లేరో కూడా అడ్రస్ లేకుండా పోయారా నేతలు. భరోసా ఇచ్చే లీడర్ లేక కేడర్ కూడా కన్ఫ్యూజ్‌లో ఉందట. అంత తేడాగా ప్రవర్తిస్తున్న ఆ లీడర్స్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది?
హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. Mahesh Babu: బాబు, పవన్ గెలుపు.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్లు ఇక జంట నగరలలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలా అనేక ప్రాంతాల్లో గాలి ఉరుములతో కూడిన భారీ…