ఐపీఎల్‌లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి…
మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ అధికారికంగా తప్పుకున్నాడు. ఈ మేరకు తన సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ధోనీ 204 మ్యాచుల్లో చెన్నైకు సారథ్యం వహించగా ఆ జట్టు 121 విజయాలు సాధించింది. నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా 9 సార్లు ఫైనల్…
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన జడేజా ఆల్‌రౌండర్ల కేటగిరీలో 385 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ (భారత్) మూడో స్థానంలో, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 916…
స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో…
శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా డబుల్ సెంచరీ ముంగిట ఉన్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇలా చేయడం సరికాదనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై రవీంద్ర జడేజా స్పందించాడు. తానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని రోహిత్‌కు చెప్పినట్లు జడేజా స్పష్టం చేశాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. భారత్ 574…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన జడ్డూ.. ఏకంగా 228 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా టెస్ట్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ మాత్రమే. ఈ క్రమంలో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా 175…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని…
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీనే. అతడి సారథ్యంలో చెన్నై జట్టు అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. నాలుగు సార్లు ట్రోఫీని కూడా గెలుచుకుంది. అయితే వచ్చే ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును నడిపించనున్నాడని సమాచారం.…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ ఫైర్ ఇంకా తగ్గనేలేదు. ఓటిటిలో విడుదలైనప్పటికీ తగ్గేదే లే అంటూ ‘పుష్ప’రాజ్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మాయలో పడుతున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిందో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా ‘పుష్ప’ ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘తగ్గేదే లే… పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?… ఫైరూ…”…