Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియాకు బిగ్‌షాక్ తప్పేలా కనిపించడంలేదు. మోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరమైన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోకాలి సర్జరీ నేపథ్యంలో జడ్డూ ప్రపంచకప్ ఆడకపోవచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జడేజా కోలుకోవడానికి ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పట్టవచ్చని అభిప్రాయపడింది.…
టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జడేజా, తాజాగా కుడి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దాంతో, ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు జడేజా అందుబాటులో ఉండడని ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం జడ్డూ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. ఇక, జడేజా స్థానంలో…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (31), పంత్ (26) ఫర్వాలేదనిపించారు. అయితే వాళ్లిద్దరూ అవుటయ్యాక ఇన్నింగ్స్ ఒడిదుడుకులకు లోనైంది. విరాట్ కోహ్లీ (1) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (15), హార్డిక్ పాండ్యా (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే దినేష్ కార్తీక్ (12) తో కలిసి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (29…
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో.. సీఎస్కేకి జడేజా గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు మరింత బలపడ్డాయి. నిజానికి.. చెన్నై జట్టుకి డెడికేటెడ్‌గా ఉన్న ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ కూడా! ఒంటిచేత్తోనే ఆ జట్టుని ఎన్నోసార్లు ముందుకు నడిపించిన సందర్భాలున్నాయి. అలాంటి జడేనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.…
ఈనెల 22 నుంచి టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు పాల్గొంటుంది. ఈ పర్యటనకు తాజాగా టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పి్ంచారు. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను బీసీసీఐ రొటేటింగ్ చేస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు పంత్ మెరుపు సెంచరీ చేయగా.. రెండో రోజు తొలి సెషన్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది మూడో సెంచరీ కాగా ఈ ఏడాది రెండో సెంచరీ. అటు ఓవర్సీస్లో మాత్రం జడేజాకు ఇదే తొలి సెంచరీ. అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి…
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలుత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలు, టీ20లలో కూడా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మేరకు వన్డేలు, టీ20లకు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి హార్డిక్ పాండ్యా పునరాగమనం చేశాడు. అటు గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల పొట్టి క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా సెలక్టర్లు…
అసలే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంత మాత్రమే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు నీరుగారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టుకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పక్కటెముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా ఛాతిపై గాయాలయ్యాయి. అందుకే, అతడు…
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జడేజాను కెప్టెన్‌గా చేయడమే చెన్నై టీమ్ చేసిన పెద్ద తప్పు అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావించినప్పుడు ఈ సీజన్ మొత్తానికి జడేజానే కొనసాగించాల్సిందని సెహ్వాగ్ అన్నాడు. అయితే టోర్నీ మధ్యలో మళ్లీ కెప్టెన్సీని ధోనీకి అప్పగించడం సరికాదని పేర్కొన్నాడు. అటు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లను పదే పదే మార్చుతుండటాన్ని…
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా మళ్లీ ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగారు… ఈ సీజన్‌లో ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 పరాజయాలను చవిచూసింది.. రెండు మాత్రమే గెలిచింది.. ఒక్కప్పుడు తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన ఆ జట్టు.. ఈ సీజన్‌లో డీలా పడడం.. ఆ జట్టు అభిమానులు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో కెప్టెన్‌గా ఉన్న రవీంద్ర జడేజాపై విమర్శలు పెరిగాయి.. దీంతో.. ఆటపై కూడా దృష్టిపెట్టలేకపోతున్నాడట.. వరుస ఓటములతో…