చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా మళ్లీ ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగారు… ఈ సీజన్‌లో ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 పరాజయాలను చవిచూసింది.. రెండు మాత్రమే గెలిచింది.. ఒక్కప్పుడు తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన ఆ జట్టు.. ఈ సీజన్‌లో డీలా పడడం.. ఆ జట్టు అభిమానులు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో కెప్టెన్‌గా ఉన్న రవీంద్ర జడేజాపై విమర్శలు పెరిగాయి.. దీంతో.. ఆటపై కూడా దృష్టిపెట్టలేకపోతున్నాడట.. వరుస ఓటములతో కెప్టెన్సీ వదులుకున్నాడు.. తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.. ఇక, మళ్లీ మిస్టర్ కూల్ కెప్టెన్‌గా రంగంలోకి దిగారన్న మాట.
Read Also: SSC Exams: ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టిపెట్టండి..
మళ్లీ టీమ్‌ను నడిపించడానికి ఎంఎస్ ధోనీ అంగీకరించాడు.. జడేజా తన ఆటపై దృష్టి పెట్టడానికి అనుమతించారని ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. ఐపీఎల్ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.. కానీ, వరుస ఓటములు ఆ జట్టును ఇబ్బంది పెట్టాయి.. సీఎస్కే పేలవమైన ఫామ్ పై విమర్శుల వచ్చాయి.. అయితే, జడేజా మాత్రం టోర్నమెంట్‌లో బాగానే కష్టపడ్డారు.. 121.7 స్ట్రైక్ రేట్‌తో 92 బంతుల్లో కేవలం 112 పరుగులు చేశాడు, అలాగే ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 8.19 ఎకానమీ రేటుతో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, మళ్లీ ధోనీ రంగంలోకి దిగడంతో చెన్నై రాత మారుతుందేమో చూడాలి.. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది.. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది తొమ్మిదో మ్యాచ్.