CM Revanth Reddy: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మనది ప్రజలందరిది.. తాడిత, పీడిత, దళిత, గిరిజన అణగారిన వర్గాలు నోరు లేనటువంటి వారికి గొంతుకగా నిలిచేదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన…