CM Revanth Reddy: నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా.. వరుస ఎన్నికల కోడ్‌లతో స్తంభించిన పాలనకు గండి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాయి.
Read also: Rohit Sharma: టాస్ కాయిన్ ఎక్కడ.. రోహిత్ శర్మ ఫన్నీ వీడియో!
Also Read
రైతు రుణమాఫీ వంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు హామీల అమలుతో పాటు సాధారణ పాలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే.. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన, ఆదాయ వనరుల పెంపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షలు ప్రారంభించగా, నేటి నుంచి మంత్రులందరూ అన్ని శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఆయా శాఖల పనితీరును తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రులందరూ వారి వారి నియోజకవర్గాలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలు, బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలిస్తారు.
Amaravati: అమరావతికి పూర్వ వైభవం..సంతోషంలో రైతులు
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!