చిలకలగూడా రైల్వే క్వార్టర్స్ లో మూడు దశాబ్దాల పాటు నివసించిన తన అనుభవాలను 'చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ 221/1' పేరుతో సినిమాగా తీయాలని ఉందని ప్రముఖ రచయిత, నట దర్శకుడు తనికెళ్ళ భరణి చెప్పారు. శుక్రవారం ఆయన్ని లలిత కళా సమితి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది.