విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 206 అడుగుల అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. సమసమాజ స్థాపనకు సీఎం జగన్ నడుంబిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ కాదని నిరూపించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు.…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ పక్కనున్న ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై రకరకాల ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలోని ముగ్గురు కీలక నేతలు రేపు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ ఒకప్పుడు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు. మధ్యలో నేతల మధ్య విభేదాలతో పార్టీ పట్టుకోల్పోయింది. అయినప్పటికీ అక్కడ టీడీపీకి గట్టి ఓటుబ్యాంకే ఉంది. గతంలో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాకినేని పెదరత్తయ్య వరసగా ఐదుసార్లు గెలిచారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత సైకిల్ జోరు తగ్గింది. కాంగ్రెస్, వైసీపీలు పట్టు సాధించాయి. ప్రస్తుతం మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే పరిస్థితి తాడికొండలోనూ ఉంది.…
ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు రావెల కిషోర్ బాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ పంపారు. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు రావెల కిషోర్‌బాబు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన రావెల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. Somu Veerraju:…
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.…
సత్యం చెప్పే హరిచ్ఛంద్రులం.. అవసరానికో అబద్ధం అన్నట్టు.. రాజకీయ నాయకుల నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకోవడంలో పొలిటీషియన్స్‌ను మించివాళ్లు ఉండరు. గుంటూరు పాలిటిక్స్‌లో ఇప్పుడదే జరుగుతోంది. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబుకు బాగా కలిసొచ్చిందనే చర్చ మొదలైంది. రెండేళ్ల క్రితం రావెల బీజేపీలో చేరారు. కాషాయం కండువా కప్పుకొని కనిపిస్తున్నా.. ఆయన మనసంతా టీడీపీలో ఉన్నట్టు, సైకిల్‌ను బాగా మిస్సవుతున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. తప్పనిసరి…