Ravela Kishore Babu : ఆ మాజీ మంత్రికి కాలం కలిసిరావడం లేదా..? ఎన్నో ఆశలు పెట్టుకున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravela Kishore Babu : ఆఫీసర్ పాత్ర నుంచి రాజకీయాల్లోకి వచ్చీరావడంతోనే మంత్రి అయ్యారు. తర్వాత అడుగులు తడబడి.. పొలిటికల్ తెరపై ఫేడ్ అవుట్ అయ్యారు ఆ మాజీ మంత్రి. ఎన్నో ఆశలతో సొంత గూటికి తిరిగి వెళ్దామని అనుకున్నా.. బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం జంక్షన్ జామ్. కాలం కలిసి రాక కాలక్షేపం చేయాల్సిందేనా? ఎవరా మాజీ మంత్రి?
రావెల కిశోర్ బాబు. 2014లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ వెంటనే మంత్రి అయిపోయారు. టీడీపీ అధికారంలో ఉండగానే.. అసంతృప్తి మూటగట్టుకోవడంతో మధ్యలోనే కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పలేదు. తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి.. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరిపోయారు రావెల. గ్లాసు గుర్తుపై పోటీ చేసినా నెగ్గలేదు. ఆపై అక్కడా కుదురుగా ఉండలేదు. బీజేపీకి జైకొట్టి.. కాషాయ కండువాను మెడలో వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీకి హ్యాండిచ్చారు. తిరిగి టీడీపీలోకి వెళ్తున్నట్టు సంకేతాలు ఇచ్చి.. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి.. తెలుగు తమ్ముళ్లలో అనేక ప్రశ్నలకు కేంద్ర బిందువు అయ్యారు రావెల.
Also Read
మహానాడు సమయంలోనే రావెల కిశోర్‌బాబు టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో.. ఆయన టీడీపీ కండువా కప్పుకోలేదు. జిల్లా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా లేరు. దీంతో మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నగా మారింది. రావెలను టీడీపీలోకి రాకుండా ప్రత్తిపాడులోని కొన్ని గ్రూపులు అడ్డుకున్నాయట. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా ఉన్న మాకినేని పెదరత్తయ్య సైతం కార్యకర్తల మనోభావాన్ని పార్టీ పెద్దలకు వివరించారట. గతంలో కిశోర్‌బాబు గ్రూపులు కట్టడం వల్లే ప్రత్తిపాడులో టీడీపీ ఇబ్బంది పడిందని.. ఇప్పుడు ఆయన మళ్లీ వస్తే అదే రిపీట్ అవుతుందని పెదరత్తయ్య చెప్పారట. దాంతో టీడీపీ హైకమాండ్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
టీడీపీలో చేరినా.. ఫలానా చోట టికెట్ కావాలని కండీషన్ పెట్టొద్దని రావెలకు సమాచారం వెళ్లిందట. ఆ కబురు రుచించక టీడీపీలో జాయినింగ్‌ను దాట వేశారని ప్రత్తిపాడులో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూడు పార్టీలు మారిన రావెల..టీడీపీలోకి వెళ్లినా టికెట్ గ్యారెంటీ లేకపోతే ఎలా అనే సంశయంలో పడ్డారట. అందుకే మౌనంగా ఉన్నారట. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత కుటుంబంలో ఒకరు బాపట్ల ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం తెలిసి రావెల తన ప్లాన్ మార్చుకున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు దగ్గరకు వచ్చాక వ్యూహాలకు పదును పెట్టాలని చూస్తున్నారట.
ప్రత్తిపాడులో రావెల రాజకీయ కథ ముగిసినట్టేనని స్థానికంగా మరో చర్చ నడుస్తోంది. జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి ఆయన అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ నియోజకవర్గం ఏంటన్నది.. ఏ పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తారన్నది బయట పెట్టడం లేదట. మొత్తంగా మెరుపు వేగంతో రాజకీయాల్లోకి వచ్చి.. అంతే వేగంతో పొలిటికల్ స్క్రీన్ పైనుంచి తెరమరుగయ్యారు. మరి.. కొత్త ఆలోచనలు మాజీ మంత్రికి వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!