రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. Read Also: మరిన్ని…
కరోనా మహమ్మారి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో రేషన్‌ను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. మే, జూన్ నెలలకు కూడా కేంద్రం ఉచితంగా రేషన్‌ను అందించింది. కాగా, ఈ రేషన్ మరో 5 నెలలపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్! బియ్యం రేషన్ కార్డు ఉన్నవారికి ఇంట్లో…
తెలంగాణ రేషన్ డీలర్స్‌తో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి.. రేషన్ డీలర్స్ ప్రధాన సమస్యలైన రూ.28 కోట్ల పాత బకాయిలు విడుదల చేసేందుకు సుముఖతం వ్యక్తం చేసింది ప్రభుత్వం.. ఇక, కరోనాతో చనిపోయిన డీలర్స్ కు ఎక్స్ గ్రేషియా, కాంటాకు బ్లూ టూత్ తీసివేయడం, కరోనాతో చనిపోయిన డీలర్లకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా వారి కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్ కుమార్.…
కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను విధించారు. ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. పైగా ఆ రాష్ట్రంలో…