కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను విధించారు. ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది.
పైగా ఆ రాష్ట్రంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలకు కొరత ఏర్పడింది. ఐసీయూ యూనిట్లో చేరేవారి సంఖ్య పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇండోర్ లోని స్టేడియంలో అతిపెద్ద కోవిడ్ 19 ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తే పేదలకు ఇబ్బందులు ఎదురౌతాయనే ఉద్దేశ్యంతో మూడు నెలల పాటు ఉచిత రేషన్ ను అందించబోతున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు.