TATA vs Pakistan Economy: భారత పారిశ్రామిక దిగ్గజం, గొప్ప మానవతావాది, ఫిలాంత్రోపిస్ట్ రతన్ టాటా కన్నుమూశారు. 86 వయసులో ఆయన స్వర్గస్తులయ్యారు. అయితే, గుండు సూది నుంచి విమానం వరకు, ఉప్పు నుంచి ఆటోమోబైల్స్ వరకు టాటా వస్తువులు లేని ఇళ్లు భారతదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, దాదాది దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, టాటా గ్రూప్ మొత్తం విలువ కన్నా తక్కువ.
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా..
ఏ సంస్థ అయితే తనను అవమానించిందో, అదే సంస్థను కొనుగోలు చేసి బ్రిటీష్ వాళ్ల గర్వాన్ని అణిచివేశారు రతన్ టాటా. ఇది రతన్ టాటాకు వ్యాపార విజయం కన్నా, వ్యక్తిగత విషయంగా పరిగణించబడుతుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గత రాత్రి కన్నుమూశారు. కానీ ఆయన భారతీయుల మదిలో ఎప్పటికీ బతికే ఉంటారు. టాటా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.
Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం, దానకర్ణుడు రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని కొతపుంతలు తొక్కించిన వ్యక్తిగా రతన్ టాటా ఖ్యాతికెక్కారు. తాను సంపాదించిన డబ్బును అనేక ఛారిటీ సంస్థలకు, సేవలకు ఉపయోగించి మహోన్నత వ్యక్తిగా నిలిచారు. రతన్ టాటా మరణం దేశానికి తీరనిలోటుగా దేశ ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ నేతల దగ్గర నుంచి పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర ప్రముఖులు టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల…
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాపార రంగంలోనే కాకుండా.. క్రీడాకారులకూ అండగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల నుంచి టీమిండియా క్రికెటర్లకు సాయం చేశారు. క్రికెటర్లకు అండగా నిలిచేందుకు తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చారు. టాటా పవర్స్, టాటా స్టీల్స్, టాటా ఎయిర్‌లైన్స్ విభాగాల్లో పలువురు భారత క్రికెటర్లకు ఉద్యోగావకాశాలను కంపెనీ కల్పించింది. అంతేకాదు వారికి స్పాన్సర్ చేస్తూ ప్రోత్సహించింది. టాటా గ్రూప్ నుంచి చాలా మంది భారత క్రికెటర్లు…
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే రతన్ టాటాకు నివాళులర్పించింది.. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు.
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు. కొణిదెల చిరంజీవి : భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా ఏ ఒక్క భారతీయుడు కూడా తన సేవలను ఒక విధంగా స్పర్శించని వ్యక్తి లేడు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు, నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి అసాధారణ మానవుడు. శ్రీ రతన్ టాటా యొక్క విరాళాలు ఇలస్ట్రియస్…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై ఎలాంటి చర్చ చేపట్టకుండానే వాయిదా పడింది.. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని సంస్థకు మూలస్తంభంగా మార్చారు. తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రతన్ టాటా.. వయో సంబంధిత సమస్యలతో బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖులు అందరూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రతన్.. భారత్‌కు రావాలని అనుకోలేదు.…