పీఎం కేర్స్ ఫండ్ కొత్త ట్రస్టీలుగా ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాను నియమించారు.
Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలో ముందుంటారు. తాజాగా ఆయన గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభోత్సవంలో రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తోడుంటే బాగుండు అని ఒంటరిగా సమయం గడిపే వరకు.. ఒంటరితనమంటే తెలియదని రతన్ టాటా వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అసలు…
మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్‌లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన…
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ చేజిక్కించుకున్నది. ఎయిర్ ఇండియా సంస్థను టాటాలే స్థాపించారు. ఆ తరువాత అందులో భారత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంతో అది ప్రభుత్వరంగ సంస్థగా మారింది. కాగా, ఇప్పుడు ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో తిరిగి టాటాలు బిడ్‌లో దక్కించుకున్నారు. తాము స్థాపించిన సంస్థ తిరిగి టాటాలకు చేరడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న రతన్ టాటాకు ముంబైలోని సర్ రతన్ టాటా ఇనిస్టిట్యూట్…
బిజీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఉన్నారు.. దీంట్లో ముందు వరుసలో ఉంటారు.. ఆనంద్ మహేంద్ర.. ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విషయాలపై స్పందిస్తుంటారు.. ఇక, అప్పుడప్పుడు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. తాజాగా రతన్ టాటాను ఓ ఫొటో ఆకట్టుకుంది.. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే టాటా.. ఆ ఫొటోలోని సన్నివేశాన్ని చూసి స్పందించకుండా ఉండలేకపోయారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను షేర్…
మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను తదుపరి రాష్ట్రపతిని చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసేవాడు కాదు.. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఈమేరకు రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచిస్తూ.. #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే ఏడాది…