ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి…