3 People Died In Vizag Car Accident: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు యువకుల గ్యాంగ్ మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారుని నడపడంతో ఈ ఘటన సంభవించింది. ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొనడంతో.. బైక్‌పై ఉన్న దంపతులు సహా కారులో ఉన్న ఓ యువకుడు మృతి చెందారు. 36 మీటర్ల దూరంలో కారు ఎగిరిపడిందంటే.. ఎంత వేగంగా కారు నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో కారు, బైక్ రెండూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదానికి ముందు సాగర్ నగర్ దగ్గర ఆ ఆరుగురు యువకులు స్థానికులతో గొడవ పడ్డారు. బీరు బాటిళ్లతో దాడికి ప్రయత్నం చేశారు. అయితే.. స్థానికులు తిరగబడటంతో వాళ్లు వెనుదిరిగారు. ఘర్షణ తర్వాత కొద్దిసేపటికే కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తు, ఆపై అతివేగం.. వెరసి మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని దంపతులు.. ప్రమాద స్థలిలోనే దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది.
Evil Eye Remedy: నరదిష్టి ఇబ్బందిపెడుతుందా.. తాంత్రికుడి సాయం లేకుండా ఇలా చేయండి
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వైజాగ్‌కి చెందిన ఆరుగురు యువకులు కారులో మద్యం సేవిస్తూ.. సాగరనగర్ నుంచి రుషికొండ వైపు వేగంగా వెళ్తారు. రాడిసన్ బ్లూ హోటల్ సమీపానికి వచ్చేసరికి.. కారు నడుపుతున్న యువకుడు వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో.. కారు అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి, అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో రుషికొండ నుంచి నగరానికి వెళ్తున్న దంపతుల బైక్‌ను ఆ కారు ఢీకొట్టింది. ఈ హఠాత్పరిణామంతో దంపతులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. అలాగే.. కారులో వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న యువకుడితోపాటు ముందు కూర్చన్న మరో యువకుడు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన భార్యభర్తలను.. పృధ్వీరాజ్ (28), ప్రియాంక్ (21)గా గుర్తించారు.
Faria Abdullah : ఆ స్టార్ హీరో పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాట్ బ్యూటీ..