ఈమధ్య కాలంలో యువత బాగా దూసుకుపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావం వారిపై బాగా పడుతోంది. సోషల్ మీడియాలో తాము కనిపించాలని, తమ వీడియోలు అప్ లోడ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే, తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా విజయవాడలో ఓ యువతి చేసిన రీల్స్ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇన్ స్టాలో రీల్స్ చేసిన యువతి భరతం పట్టారు విజయవాడ పోలీసులు. ఇన్స్టా రీల్స్ చేసిన యువతి కి ఫైన్ విధించారు విజయవాడ పోలీసులు. విజయవాడ కనకదుర్గ వారధిపై నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇన్స్టా రీల్స్ చేసింది తనూజ అనే యువతి.
Read Also: ప్రపంచంలోని 10 అత్యంత అద్భుతమైన సహజ రాతి నిర్మాణాలు
తాను డ్రైవ్ చేస్తూ చేసిన రీల్స్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోకు లైక్స్, షేర్ లు వచ్చాయి. ఆమె చేసిన ఇన్ స్టా రీల్స్ పై ఓ నెటిజన్ ట్విట్టర్లో స్పందిస్తూ విజయవాడ పోలీసులను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమె వాహనానికి చలానా విధించినట్లు ట్వీటర్లో పేర్కొన్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు పోలీసులు. ఇలా రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడం, సోషల్ మీడియా పిచ్చితో ఇబ్బందుల పాలు కావడం ఈమధ్య కామన్ అయిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా కోసం ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిది.
Read Also:Perfumes : మగవారు ఆ టైమ్‌లో ఈ పెర్ఫ్యూమ్స్ వాడితే.. ఆడవారికి చాలా ఇష్టమట..