Srilanka Board: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. అత్యాచార ఆరోపణల కారణంగా ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన గుణతిలక ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టం చేశారు. ఈ మేరకు అతడు అరెస్ట్ కావడంతో ధనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.…