బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఉత్తర్వును విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) సలహా బోర్డు ఆమోదించింది. ఇందులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం, ఒక సంవత్సరం జైలు శిక్ష కాలంలో ముగ్గురూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోల్పోయారు. అంటే, వారిలో ఎవరూ మొత్తం శిక్షా కాలంలో…
Ranya Rao Gold Smuggling Case: బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన నటి రన్యా రావు కేసులో కీలక ఈడీ దూకుడు పెంచింది. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరతో సంబంధం ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కాలేజీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు చేస్తుంది.
Ranya Rao Case: సినీ నటి, బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రన్యా రావు కేసులు సంచలనం నమోదైంది. బంగారం కొనుగోలుకు హవాలా మార్గాల్లో డబ్బును బదిలీ చేసినట్లు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) న్యాయవాది మధురావు ఈ వాదనను వినిపించారు.
Ranya Rao: రన్యా రావు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో కేసు సంచలనంగా మారింది. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యా రావును అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఆమె సవతి తండ్రి, డీజీపీ(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) కె రామచంద్రరావుని ప్రభుత్వం తప్పనిసరి…
Ranya Rao Case: సినీనటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ప్రత్యేకమైన బెల్టు సాయంతో నడుముకు చుట్టుకుని తీసుకువస్తుండగా, బెంగళూర్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఈ కేసులో గోల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు భావిస్తుండటంతో ఇటు ఈడీ, అటు సీబీఐ రెండూ…
Ranya Rao Case: బంగారం అక్రమ రవాణా కేసులో సినీ నటి రన్యా రావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనల్లో ఏకీభవించారు.
బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యారావు కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.
Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రారావు కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్‌ని శరీరానికి కట్టుకుని…
Ranya Rao: కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక డీజీపీ, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి కె రామచంద్రరావు కుమార్తె కావడంతో ఈ వ్యవహారం మరింతగా వార్తల్లో నిలిచింది. తన కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒక అధికారిగా కాకుండా ‘‘గుండె పగిలిన తండ్రి’’గా మాట్లాడుతూ,…