Ranya Rao: కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ కర్ణాటక డీజీపీ, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి కె రామచంద్రరావు కుమార్తె కావడంతో ఈ వ్యవహారం మరింతగా వార్తల్లో నిలిచింది. తన కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఒక అధికారిగా కాకుండా ‘‘గుండె పగిలిన తండ్రి’’గా మాట్లాడుతూ, తన కుమార్తె స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తనకు తెలియదని చెప్పారు. ఆమె అరెస్ట్ గురించి మీడియా నివేదికల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ‘‘ఇటీవలి పరిణామాల వల్ల నాకు కలిగిన షాక్, బాధ, విధ్వంసాన్ని ఏ పదాలు నిజంగా వ్యక్తపరచలేవు’’ అని ఆయన అన్నారు. తాను ఎల్లప్పుడూ తన కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్రజలు, మీడియాలు న్యాయంగా వ్యవహరించాలని ఆయన అభ్యర్థించారు.
Read Also: YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
మార్చి 3న బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి రూ. 12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ రన్యా రావు పట్టుబడ్డారు. ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రకారం, ఈ ఏడాది జనవరి నుండి 27 సార్లు ఆమె దుబాయ్‌కి వెళ్లింది, దీంతో వ్యవస్థీకృత స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఆమె ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2024లో రన్యా రావు జతిన్ హుక్కేరిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రన్యా తన భర్తతో కలిసి స్వతంత్రంగా జీవిస్తున్నట్లు ఆమె తండ్రి రామచంద్రరావు తన ప్రకటనలో పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె తమ ఇంటికి రావడం కానీ, మేము వారి ఇంటికి వెళ్లడం కానీ జరగలేదని ఆయన చెప్పారు. ఇద్దరికి మధ్య స్పష్టమైన విభజన ఏర్పడినట్లు పేర్కొన్నారు. రన్యా రావు ఏదైనా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే, చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పారు.
తన కెరీర్‌లో ఒక్క మచ్చ కూడా లేదని చెప్పారు. అయితే, రామచంద్రరావు కెరీర్‌లో కూడా కొన్ని వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2014 హవాలా కేసులో పెద్ద మొత్తంలో డబ్బు అదృశ్యమైందని, 2016లో నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మరణాలప సీఐడీ దర్యాప్తు ఉందని తెలుస్తోంంది. ప్రస్తుతం, రన్యా రావు 1962 కస్టమ్స్ చట్టం ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఆమె బెయిల్‌పై శుక్రవారం తీర్పు రానుంది.