ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో.. తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగుడ జాగీర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇంఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన ప్రచారం చేశారు.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఫైరయ్యారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, తనకు చేవెళ్ళలో పోటీ ఉంటుందని.. తాను బాధ్యతాయుతమైన నేత అని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. బాలాపూర్, బడంగ్పేట్, సరూర్నగర్ సీఎం రేవంత్ రోడ్ షోలో రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏనాడైనా కొండా చేవెళ్ళ ప్రజలతో కలిశారా? వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారా? అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణ…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏజ్ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశంలో పాల్గొన్నారు.
మొయినాబాద్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జి. రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయి.. కాంగ్రెస్ వస్తే బీసీగణన పథకాలు వస్తాయని తెలిపారు. ఇదే విషయాన్ని మొన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే.. బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవెళ్ళలోని ఊర్లు కాదని.. టూర్లు అని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని, చేవెళ్ళ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే.. ఆయన ఇంట్లో పడుకొని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు.
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంకకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. శుభప్రదమైన ఆంజనేయ స్వామి జయంతి రోజున.. తాను తన మొదటి సెట్ నామినేషన్ వేయడం ఆ భగవంతుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి.. చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఇంఛార్జీలు భీం భరత్, కస్తూరి నరేందర్, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు…
చేవెళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడ తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూతు కమిటీల మీటింగ్.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు.