ఉపాధి కూలీలకు శుభవార్త. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రిలీజ్ అయ్యాయి. వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. వ్యవసాయ పట్టా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఎవరికి…
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు.. న్యాయమూర్తిపై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది.
ప్రభుత్వ ఉద్యోగికి మాయమాటలు చెప్పి బంగారు ఉంగరంతో దొంగ బాబాలు పరారైన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తక్కల్ల పల్లి, గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేంది మాధవరెడ్డి, నాగార్జున సాగర్ రోడ్డు తక్కల్లపల్లి గేటు వద్ద నుండి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలోనే తెలుపు రంగు కారులో సాధువుల అవతారం ధరించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవార్నాథ్ మధారి,…
School Holiday: గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు.
ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. యువకుడు సిద్ధార్థ్ ప్రేమ పెళ్లి చేసుకోగా.. తనకు ఆడపిల్ల జన్మించిందని.. మరో పెళ్లి చేసుకోబోయాడు. ఒక రిసార్ట్ లో మరొక పెళ్లి రెడీ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధిత మహిళ కవిత.. ఎలాగైనా పెళ్లిని ఆపుతానని తెలిపింది. ఆడబిడ్డ పుట్టిందని వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. రూ. కోటి కట్నం కావాలని…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని హసన్ నగర్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అల్మాస్గూడలోని వినాయక హిల్స్ లో కూతురు నిహారిక అత్తను తండ్రి చంపేశాడు.