Gudivada Amarnath: విశాఖలో రాండ్ స్టాడ్ రిక్రూట్‌మెంట్ కంపెనీని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాండ్ స్టాడ్ లాంటి గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉన్న కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయంటే భవిష్యత్‌ను అర్ధం చేసుకోవచ్చన్నారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రఖ్యాత సంస్థలన్నీ విశాఖకు తరలివస్తుండటం సానుకూల సంకేతమని మంత్రి అమర్నాథ్ అన్నారు. జనవరి నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు…