టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి సంబంధించిన న్యూ లుక్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత వచ్చిన రానా లేటెస్ట్ పిక్ పై ఆయన అభిమానులు భారీగా లైకులు కురిపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా బరువు తగ్గిన రానా లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన మునుపటి రూపంలోకి రానా మారిపోతున్నాడు. కఠినమైన ఆహారం, వ్యాయామాలతో మళ్ళీ కొత్త మేకోవర్ లోకి చేంజ్ అయ్యాడు రానా.…
మలయాళ సూపర్‌హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా నిత్యామీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. సెకండ్ వేవ్ కంటే ముందు శరవేగంగా సాగిన ఈ చిత్ర షూటింగ్.. ఆ తరువాత వాయిదా పడింది. కాగా అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, ఈ చిత్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ కు బ్రేకులేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తదుపరి…
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, కాథరీన్ త్రెసా లాంటి భారీ తారాగణం తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది. దగ్గుబాటి రానా ఆమె ప్రియుడిగా నటించగా… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించగా.. తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. కాగా వినాయక్ ఇదివరకు గెస్ట్ పాత్రల్లో మెరిసిన…
తెలుగులో ఆసక్తికరమైన చిత్రాలు వరస కడుతున్నాయి. అయితే అవి థియేటర్లలో కాదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. వాటి టీజర్స్, ట్రైలర్స్ చూస్తుంటే… ఈ న్యూ వేవ్ మూవీస్ జోరు మరికొంతకాలం కొనసాగేట్టుగానే కనిపిస్తోంది. తాజాగా అలాంటి మూవీ ట్రైలర్ ఒకటి ఈ రోజు సాయంత్రం విడుదలైంది. థ్రిల్లర్ జానర్ కు చెందిన పచ్చీస్ మూవీ ట్రైలర్ ను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతంలో దీని టీజర్…
కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలారంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు, గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మిసాలా భూమన్న గూడెం, గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాలలోని…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ పై ఉంచారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీనిని ఎ.ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో హారిక అండ్ హాసిని సంస్థ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లోనూ పవన్ నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఇందులో టైటిల్ పాత్రను పవన్ తో పాటు రానా సైతం షేర్ చేసుకుంటున్నాడు. ముక్కుసూటిగా పోయే పోలీస్ ఆఫీసర్ గా పవన్…
కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇప్పటికే ‘బాహుబలి, ఘాజీ, అరణ్య’ వంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన రానా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను సిహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా మూవీ షూటింగ్ పూర్తి కాగానే, రానాతో ఈ సినిమాను ప్రారంభిస్తామని నిర్మాతలు…
కరోనాను ఎదుర్కొవడంలో కేవలం వైద్య సిబ్బందే కాదు… ఇతరులూ తమ వంతు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ మొదలు కొని ఎంతో మంది సెలబ్రిటీస్ తమ పరిథిలో ఆపన్న హస్తం అందించే పనిలో ఉన్నారు. సురేశ్ ప్రొడక్షన్ వంటి నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు కరోనా బాధితుల అవసరాలు తెలుసుకుని, సోషల్ మీడియా ద్వారా వారికి సహాయం చేసే వారికి ఆ విషయాన్ని చేరవేసే పని చేస్తున్నాయి. ఇదే సమయంలో నటుడు రానా మరో అడుగు ముందుకేసి కరోనా…