ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు
Pawan Kalyan Emotional Note on Ramoji Rao Death: రామోజీ రావు కన్నుమూతతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ రామోజీరావు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడు రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది, ఆయన…
Mm Keeravani Wanted Oscar for Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్…
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు అని గుర్తుచేశారు
తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు బీజేపీ ఏపీ ఛీప్ దగ్గుబాటి పురంధేశ్వరి.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాపం ప్రకటించిన ఆమె.. ఈనాడు అధినేత రామోజీ రావు లేరన్న వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచిందన్నారు.
Jr NTR Emotional Tweet on Ramoji Rao Death: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం అస్వస్థత ఏర్పడడంతో నానక్ రామ్ గూడలో ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన కన్నుమూశారు. ఇక ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం…
Ramoji Film City Unknown Facts: రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం అదేనండీ ఫిలింసిటీ. హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, నిర్మించబడుతున్నాయి.…
Ramoji Rao Died without fulfilling his goal as Producer: ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితులు అయిన రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాదు అనేక సినిమాలను నిర్మించారు కూడా. ఉషాకిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన అఆయన ఎన్నో మరపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. హృద్యమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యువ దర్శకులకూ, నటీనటులకు అవకాశాలిచ్చి, వారి ప్రతిభను బయటకు తీసుకొచ్చి…