మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా గెలిచినందుకు సదరు లేఖలో కవితకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తిని గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నా’…