తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కూడా ప్రకటించారు. సీక్వెల్ లో హనుమాన్ పాత్ర సినిమాలో కీ రోల్ పోషిస్తుందని కూడా సినిమా చూసినపుడు అర్ధం అవుతుంది. అయితే ఆ రోల్ లో నటించే హీరో ఎవరనే చర్చ మొదటి నుండి ఆసక్తికరంగా మారింది.…