ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని మంత్రి పరిశీలించారు.
నగరంలోని రాంగోపాల్‌పేట్‌లోని తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి వరకు అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో.. పోలీసులు దాడి చేశామని అన్నారు. పబ్ లోని 18 మందిని అదుపులో తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. పబ్ లో అనుమతి లేకుండా యువతులతో నృత్యాలు చేయిస్తున్నారని అన్నారు. 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. తకీల పబ్‌ను సీజ్ చేసినట్లు…