నగరంలోని రాంగోపాల్‌పేట్‌లోని తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి వరకు అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో.. పోలీసులు దాడి చేశామని అన్నారు. పబ్ లోని 18 మందిని అదుపులో తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. పబ్ లో అనుమతి లేకుండా యువతులతో నృత్యాలు చేయిస్తున్నారని అన్నారు. 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. తకీల పబ్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. ఏప్రిల్ 17 న ( ఆదివారం) తెల్లవారుజామున పుడింగ్ పబ్ లో పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో 150మందికిపైగా పట్టుబడ్డారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లులు కూడా ఉన్నారు. ఈ వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్ లభించడంతో పబ్ యజమాని అభిషేక్‌తో పాటు, మేనేజర్ అనిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ కు ఊరట దొరికింది. ఇలా పబ్ లపై రైడ్స్ జరగటం.. మళ్ళీ 18 మందిని అరెస్ట్ చేయటంతో పబ్ ల విషయం నగరంలో చర్చనీయాంశమైంది.