బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్‌లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు.
పాకిస్థాన్ లోని కరాచీలో శుక్రవారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. భాద్ ఘర్ లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.