ప్రముఖ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా మేకర్స్ “రామారావు ఆన్ డ్యూటీ” విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ లో డేట్స్ ను అత్యధిక బడ్జెట్ చిత్రాలు ముందుగానే బుక్…