అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారిలో సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ లాఖీ అనే వ్యక్తి మొదటిస్థానంలో ఉన్నారు. అతనొక ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయనొక్కరే అయోధ్య ఆలయ నిర్మాణం కోసం 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. కాగా.. ఈ బంగారం విలువ రూ.68 కోట్లు ఉంటుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో ఇదే ఎక్కువ. కాగా.. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ అందించిన…
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈరోజు తాను భావోద్వేగానికి గురయ్యానని.. ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్ళు వచ్చాయని అన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందని తెలిపారు. అయోధ్యలో రాముడి మందిరం కోసం కొన్ని తరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వారందరికీ ఆశయం నెరవేరిందని తెలిపారు. ఇది ఒక రకంగా దేశాన్ని మరింత బలోపేతం…
KS Bharat dedicated his century to Shree Ram: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (116 నాటౌట్; 165 బంతుల్లో 15×4) సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్-ఎ తరఫున భరత్ శతకం బాదాడు. నాలుగో రోజైన శనివారం సెంచరీ చేసిన అనంతరం భరత్ వినూత్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన సెంచరీని శ్రీరాముడికి అంకితమిస్తూ.. రాముడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించిన విధానాన్ని…
Ram Mandir : 500ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు తన కొత్త, గొప్ప రాజభవనంలో నివసించబోతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, సంత్ సమాజ్, వీవీఐపీల సమక్షంలో రాంలాలా శ్రీవిగ్రహానికి సంబంధించిన చారిత్రాత్మక ఆచారం జరగనుంది.
Ayodhya Ram Mandir Guest List: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి శ్రీరాముడికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్…
అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది. జనవరి 22న ఆలయ గర్భగుడిలో ఇదే విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా.. ఈ విగ్రహం కృష్ణ శిలతో తయారైంది. విగ్రహం పొడవు 51 అంగుళాలు.. బరువు 150 కేజీలు. అయితే.. బాలరాముడి విగ్రహం గురువారం గర్భాలయానికి చేరుకుంది. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన భక్తులు..…
అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున 'ప్రాణ ప్రతిష్ఠ'కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని భావిస్తున్నామన్నారు.