ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితుడైన సతీష్ కిలారు, ‘వృద్ధి సినిమా’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ…